IND: టీమ్ ఇండియా ఫైనల్కి చేరాలంటే..! 3 d ago
మెల్బోర్న్టెస్టులో ఓడి టీమ్ ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ ఫైనల్కు చేరాలంటే ఎంతో కృషితో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. టీమ్ ఇండియా ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో ఉండాలంటే ఆసీస్ తో సిడ్నీలో జరిగే చివరి టెస్టులో తప్పక గెలవాలి. ఓడినా లేదా డ్రా చేసుకున్నా భారత్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. సిడ్నీ టెస్టులో గెలిచినా భారత్ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాలి. జనవరి ఆఖర్లో ఆస్ట్రేలియా, శ్రీలంకల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ను శ్రీలంక 2-0తో కైవసం చేసుకుంటేనే భారత్ ఫైనల్ కు చేరుతుంది. ఒకవేళ భారత్, ఆసీస్ మధ్య చివరి టెస్టు డ్రాగా ముగిసి.. శ్రీలంక 2-0తో కంగారులపై గెలిస్తే లంకేయులు తుది పోరుకు అర్హత సాధిస్తారు. ఆస్ట్రేలియా మిగిలిన మూడు టెస్టుల్లో (భారత్ 1, శ్రీలంకతో 2) ఒక్కటి గెలిచినా ఫైనల్ కు చేరుకుంటుంది. జనవరి 3 నుంచి ఆసీస్, భారత్ మధ్య ఐదో టెస్టు ప్రారంభం కానుంది.